హెయిర్ కటింగ్ సెలూన్ యజమానికి 72 లక్షల జీఎస్టీ

విజయవాడలోని హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు 72 లక్షలు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు అందాయి

Update: 2026-04-08 12:10 GMT

విజయవాడలోని హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు 72 లక్షలు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు అందాయి. నలభై ఏళ్లుగా పంజా సెంటర్‌లో శ్రీనివాసరావు హెయిర్‌ సెలూన్‌ నిర్వహిస్తున్నారు. విశాఖలో ఐరన్‌ స్క్రాప్‌ వ్యాపారం చేసినట్టు జీఎస్టీ అధికారులు రికార్డుల్లో చూపించారు.

బ్యాంక్ ఖాతా నిలిపేయడంతో...
బ్యాంక్ ఖాతా నిలిపివేయడంతో జీఎస్టీ నోటీసుల అంశం వెలుగులోకి వచ్చింది. ఖాతా నిలిపివేతపై బ్యాంకుకు వెళ్లి ప్రశ్నిస్తే జీఎస్టీ అంశం బయటపడింది. విశాఖ వెళ్లి జీఎస్టీ‌ అధికారులను కలవాలని బ్యాంక్ అధికారులు సూచించారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని శ్రీనివాసరావు ఆవేదన చెందుతున్నారు.


Tags:    

Similar News