Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేకపోవడంతో స్వామి వారి దర్శనాన్ని సులువుగానే చేసుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో తిరుమలలోని మాడవీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉందని, తిరిగి రేపటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ప్రారంభమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఒక సీజన్ తో సంబంధం లేకుండా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హుండీ ఆదాయం మాత్రం భక్తుల రద్దీతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రేపటి నుంచి తిరిగి ఆదివారం వరకూ తిరిగి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముంది.
ఐదు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్వనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,017 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,863 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.17 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.