YSRCP : చంద్రబాబు ప్రసంగాలు కామెడీగా ఉంటున్నాయ్చంద్రబాబు ప్రసంగాలు కామెడీగా ఉంటున్నాయ్
చంద్రబాబుకు రాయలసీమ అంటే ద్వేషమని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు
చంద్రబాబుకు రాయలసీమ అంటే ద్వేషమని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పక్కా 'రాయలసీమ ద్రోహి' అని అన్నారు. అబద్ధపు ప్రచారాలు ఆపి.. సీమకు జరిగిన అన్యాయానికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు కామెడీ ప్రసంగాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, అంతా నేనే చేశాననే చంద్రబాబు మాటలు పెద్ద కామెడీగా ఉన్నాయని గడికోట అన్నారు.సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అన్న వ్యక్తి.. ఇప్పుడు అనంతపురం పచ్చదనం కూడా నాదే అంటున్నారని, అనంతపురం హార్టికల్చర్ హబ్‌గా మారడానికి కారణం చంద్రబాబు కాదు.. దివంగత వైయస్సార్ అన్న గడికోట హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు పదే పదే పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు.
రాయలసీమకు ద్రోహం చేసింది చంద్రబాబు అని...
హంద్రీనీవాకు ఎన్టీఆర్ ఒకసారి, చంద్రబాబు రెండుసార్లు కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యారని తెలిపారు. 40 టీఎంసీల ప్రాజెక్టును కేవలం 5 టీఎంసీలకు కుదించి రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, చంద్రబాబు ఇచ్చిన ఆ 'కుదింపు జీవో'ను రద్దు చేసి 40 టీఎంసీలకు పెంచిన మహానేత వైయస్సార్ అని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయలసీమ ఎడారి కాకుండా దేశంలోనే హార్టికల్చర్ హబ్‌గా మార్చిన ఘనత వైయస్సార్‌దేనని, చంద్రబాబు పాలనలో హంద్రీనీవా పనులు కూడా మొదలవ్వలేదని, కేవలం బోర్డులు మాత్రమే వేశారన్నారు. ధైర్యం ఉంటే చంద్రబాబు గుండెల మీద చేయి వేసుకుని నిజం చెప్పాలన్నారు. జీడిపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లే ప్రణాళిక వేసింది వైయస్సార్ అన్న గడికోట రాయచోటి ప్రాంతానికి నీళ్లు వచ్చాయంటే అది వైయస్సార్ పుణ్యమేనని అన్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు మేలు జరిగింది కేవలం వైయస్సార్, వైయస్ జగన్ హయాంలోనే నని తెలిపారు. లడ్డూ ప్రసాదం కల్తీ అని దుష్ప్రచారం చేసి తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని, హైకోర్టు, లా యూనివర్సిటీలను తరలించి రాయలసీమ గొంతు కోసిన ఘనత చంద్రబాబుదని, 90 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్, ఉచిత కరెంట్ ఇచ్చి హార్టికల్చర్‌ను ప్రోత్సహించింది వైయస్సార్ అని, విద్యుత్ ఛార్జీలు కట్టలేదని రైతులపై కేసులు పెట్టి జైల్లో వేసిన దుర్మార్గుడు చంద్రబాబుఅని మండిపడ్డారు.