కడప జిల్లాలో చిరుతపులులు
కడప జిల్లాలో చిరుతపులులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి
కడప జిల్లాలో చిరుతపులులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కడప జిల్లాలోని గండికోటలో చిరుతపులుల సంచారంతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు గ్రామస్థులను అప్రమత్తం చేశారు. చిరుత పులులు ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
ఎర్రకొండల వైపు...
గ్రామస్థులు ఎవరూ ఎర్ర కొండల వైపు వెళ్లొద్దని పశువుల కాపరులకు అటవీ శాఖ అధికారులకు సూచించారు. రెండు రోజుల క్రితం గొర్రెల మందపై చిరుతలు దాడిచేయడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.