ఉండవల్లి శ్రీదేవికి అండగా ఉంటాం
చంద్రబాబు మరోసారి సంచలన ప్రకటన చేశారు. టీడీపీతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఆయన చెప్పారు.
చంద్రబాబు మరోసారి సంచలన ప్రకటన చేశారు. టీడీపీతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్న వైసీపీలో బానిస బతుకుతున్నారని ఆయన తెలిపారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. అందుకు బలమైన అభ్యర్థులను సిద్ధం చేస్తామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను నలుగురిని గాడిదల్లా కొనలేదా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.
టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు...
బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తే బొత్స రాజీనామా చేయలి కదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫేక్ గేమ్ నడుతుపుతుందని తెలిపారు. సోషల్ మీడియాలోనూ మహిళలను కించపర్చే విధంగా పోస్టులు పెడుతున్నారని ెలిపారు. ఉండవల్లి శ్రీదేవికి ప్రాణహాని ఉందని చెబుతున్నారని, తమ పార్టీ ఆమెకు అండగా ఉంటుందని తెలిపారు.