సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాల్సిందే

ఆత్మకూరు ఘటన పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.

Update: 2022-01-11 07:52 GMT

ఆత్మకూరు ఘటన పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ ను ఆప్ఘనిస్థాన్ గా మార్చిన ఘనత వైసీపీకే చెల్లిందన్నారు. ఆత్మకూరులో రెండు వర్గాల మధ్య ఘటన జరిగితే, దానిని వైసీపీ, బీజేపీ ల మధ్య ఘటనగా మార్చివేశారన్నారు. వైసీపీ నేతలను కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం పెద్దలు ప్రయత్నిస్తున్నారని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు.

వారిని ఎందుకు అనుమతిచ్చారు?
ఆత్మకూరుకు మిగిలిన పక్షాలను వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు డిప్యూటీ సీఎం పర్యటనకు ఎందుకు అనుమతి ఇచ్చారని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్, శిల్పా చక్రపాణిరెడ్డిల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని బయటపెట్టాలని వారు కోరారు. ఐపీసీని వైసీపీగా మార్చేశారని ఆయన ఆరోపించారు.


Tags:    

Similar News