Andhra Pradesh : ఏపీ సర్కార్ కు గుడ్ న్యూస్... ఇక ఆ భూముల రిజిస్ట్రేషన్ తేలిక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-03-26 11:37 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానంగా వారసత్వంగా వస్తున్న వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఇకపై రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ తప్పనిసరి కాదని తేల్చింది. ఆంధ్రప్రదేశ్ లో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కల్పించింది.రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ అవసరం లేకుండా కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ తప్పనిసరి కాదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించారు.

వారసత్వంగా వచ్చిన...
ఆంధ్రప్రదేశ్ లో చాలామందికి వారసత్వంగా పూర్వీకుల నుంచి వ్యవసాయేతర భూములు వచ్చాయి. అయితే భూముల రిజిస్ట్రేషన్ చేసేందుకు హక్కు ఉన్నట్లు వీరి ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే భవిష్యత్తులో చిక్కులు ఎదురవ్వకుండా రెవెన్యూ అధికారుల నుంచి యాజమాన్య హక్కు ఉన్నట్లుగా పొజిషన్‌ సర్టిఫికెట్‌ తీసుకురమ్మని రిజిస్ట్రార్లు వారిని అడుగుతుండటంతో ఇబ్బందిగా మారింది. అయితే రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవడం కష్టం. రెవెన్యూ సిబ్బంది చేతివాటానికి తోడు ఎంత అడిగినా ఇచ్చుకోవాల్సి వస్తుంది. దీనివల్ల అవినీతి మరింత పెరిగే అవకాశముందని భావించి ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
భూముల రిజిస్ట్రేషన్ సమయంలో...
అంతేకాదు ఈ భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇంకో సూచన చేశారు. అంతేకాదు ఈ ఆస్తి వారసత్వంగా వచ్చిందని, ఇతరులకు హక్కు లేదని, నిషేధిత జాబితా (22ఏ)లో లేదని కచ్చితంగా డాక్యుమెంట్‌లో స్పష్టంగా ప్రస్తావించాలి. రిజిస్ట్రేషన్ చేయబోయే స్థలానికి పూర్తి హక్కుదారు తామేనని సెల్ఫ్ డిక్లరేషన్‌ కచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒకవేళ రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాదు రిజిస్ట్రార్లు ఆధార్‌ ఆధారంగా బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ కుటుంబ వివాదాలు, ప్రభుత్వ భూమి అనే అనుమానాలు వస్తే కనుక ఆ భూమి రిజిస్ట్రేషన్‌ నిలిపివేయనున్నారు.


Tags:    

Similar News