24 డిమాండ్లపై మంత్రి బాలినేని?

విద్యుత్తు ఉద్యోగుల డిమాండ్లపై ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టి పెట్టారు

Update: 2022-02-16 12:51 GMT

విద్యుత్తు ఉద్యోగుల డిమాండ్లపై ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టి పెట్టారు. విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నేతలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ గత నెల 28వ తేదీన ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. మొత్తం 24 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడంతో విద్యుత్తు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బాలినేని చర్చలు జరిపారు.

పీఆర్సీ పై...?
విద్యుత్తు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పీఆర్సీని వారు వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్తు సంస్థలకు చెందిన అధికారుల చేతనే పీఆర్సీ బాధ్యతను ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని ప్రయివేటీకరించడాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్తు సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులను, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై మంత్రి బాలినేని సానుకూలంగా స్పందిస్తారని విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ భావిస్తుంది.


Tags:    

Similar News