Andhra Pradesh : పేదలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉగాదికి కొత్త ఇల్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-03-01 04:34 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి పది లక్షలకు పైగా ఇళ్లకు గృహప్రవేశాలు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అసెంబ్లీలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ఇప్పటికే సుమారు మూడు లక్షల ఇళ్లకు గృహ వ్రవేశాలు చేపట్టారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల ఇళ్లకు పైగా గృహ ప్రవేశాలు చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇళ్లు లేని పేదలు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.

ఉగాదిలోగా మూడు లక్షల ఇళ్లు...
రాష్ట్రంలో 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలాలు లేవు. వారందరికీ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఉచితంగా కూటమి ప్రభుత్వం కేటాయించనుంది. అర్హులైన పేదలందరికీ కీ ఇళ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలను ముమ్మరంగా చేపడుతుంది. ఇప్పటికే మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలను రాయచోటి నుంచి ప్రారంభించారు. ఈ ఏడాది ఉగాదిలోగా దాదాపు మూడు లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు హౌసింగ్ శాఖ సమీక్షలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.
అర్హులైన వారంతా...
జూన్‌కు 2.26 లక్షలు, సెప్టెంబరులో 2.10 లక్షల ఇళ్లకు కూడా గృహప్రవేశాలు జరిగేలా లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాయి. 2029లోగా పేదలందరికీ ఇళ్లు కట్టించటంతో పాటు ఉచితంగా ఇంటి స్థలాలు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే అర్హులైన పేదలు, ఇప్పటి వరకూ ఇళ్లు లేని వారు సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసకోవచ్చు. స్థానిక గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి పక్కా గృహాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఏ ఏ డాక్యు మెంట్లు ఇవ్వాలో వారు చెబుతారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పని సరి. దీంతో పాటు సొంత ఇల్లు లేదని అఫడవిట్ ను కూడా తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News