Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ లే అవుట్లకు అనుమతులు

ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. పాత లే అవుట్ల అనుమతులను పునరుద్ధరించాలని నిర్ణయించింది

Update: 2025-04-28 07:00 GMT

ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. పాత లే అవుట్ల అనుమతులను పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో దాదాపు ఎనభై ఐదువేల కుటుంబాలు లబ్దిపొందనున్నాయి. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో అనుమతులు తీసుకుని, గడువులోగా పనులు పూర్తిచేయని 870 లే అవుట్లకు అధికారులు అనుమతులు మంజూరు చేయనున్నారు. అప్పు చేసి తాము కొనుగోలు చేసిన ఇంటిస్థలంపై బ్యాంకు రుణం కూడా అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోతున్నారు.

సీఆర్డీఏ పరిధిలోనే...
ఇందులో అమరావతి రాజధాని సీఆర్డీఏ పరిధిలోనే ఎక్కువగా ఇటువంటి లే అవుట్లు ఉన్నాయని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలోనే 624 లే అవుట్లు ఉన్నాయంటున్నారు. దీంతో పాటు విశాఖ, తిరుపతి, పుట్టపర్తి, శ్రీకాకుళం, కర్నూలు ప్రాంతంలో ఇలాంటి లే అవుట్లు మిగిలినవి ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీటన్నింటి అనుమతులను తిరిగి పునరుద్ధరించితే వారు ఇళ్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ లే అవుట్లను పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పించింది. వన్ టైం సెటిల్ మెంట్ కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News