నేతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
చేనేత సహకార సంఘాలకు మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త చెప్పారు. చేనేత సహకార సంఘాలకు ఐదు కోట్ల రూపాయల బకాయిల విడుదలకు మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. దీంతో పండగ వేళ చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. మంత్రి సవిత ఆదేశాలతో బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయం తీసుకుంది.
బకాయీలు ఐదు కోట్లు...
ఈరోజు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో ఐదు కోట్ల బకాయిల జమ కానున్నాయి. గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలను చెల్లించిన ఆప్కో, ఈ నెలలో మరొక ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు కూడా విడుదల చేసింది. సంక్రాంతి పండగకు ముందే చేనేత కార్మికులకు నిధులు విడుదల కానున్నాయి.