Supreme Court : నేడు నదీజలాల సుప్రీంకోర్టులో విచారణ
ఈరోజు పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
ఈరోజు పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం లేదని, వరద జలాలను మాత్రమే వినియోగించుకోనున్నామని ఆంధ్రప్రదేశ్ తమ వాదనలను వినిపించనుంది. అయితే వృధా జలాలని చెప్పి గోదావరి నదీ జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతుందని తెలంగాణ ప్రభుత్వం తరుపున వాదించనుంది.
గత విచారణ సందర్భంగా...
గత విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా నదీజలాల సమస్యను పరిష్కరించుకోవాలని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. కేసుపై మూడు పరిష్కరాలను సూచించిన చీఫ్ జస్టిస్ సివిల్ సూట్ దాఖలు చేయాలని సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ జరగనుంది.