కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది

Update: 2026-01-12 07:59 GMT

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. సుమారు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీ జరిగినట్లు సమాచారం. ఆలయంలో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం మాత్రం బయటకు రాలేదు. ఇటీవల ఇదే ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఆలయాన్ని...
శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని హరిముకుంద్ పండా నిర్వహిస్తున్నారు. ఏకాదశి కావడంతో తొక్కిసలాట జరిగి ఈ ప్రమాదం జరిగింది. అయితే తొక్కిసలాట జరిగినప్పటి నుంచి ఆలయం మూసివేశారు. మూసివేసిన ఆలయంలో దొంగతనం జరగడంతో ఎంత సొత్త పోయిందన్న దానిపై అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.


Tags:    

Similar News