Weather Report : ఈ జిల్లాల్లో నేడు వానలు.... ఎప్పుడూ లేని విధంగా వాతావరణంలో ఈ మార్పులెందుకంటే?

ఆంధ్రప్రదేశ్ లో నేడు వానలు పడతాయి. తెలంగాణలో చలితీవ్రత ఉంటుంది

Update: 2026-01-11 04:06 GMT

నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో నేడు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న వాయుగుండం కారణంగా తమిళనాడు తీరం వెంబడి బలమైన గాలులతో కూడిన వాతావరణం నెలకొంది. మరొకవైపు చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువయింది. పొగమంచు కూడా పెరిగిపోవడంతో సంక్రాంతికి సొంత వాహనాల్లో వెళ్లే వారు ఉదయం, రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నారు.

చలి తీవ్రత ఎక్కువగా...
దక్షిణ కోస్తా ఆంధ్ర ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈ రోజంతా చల్లటి గాలులు వీస్తూ, ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు అక్కడక్కడ తేలికపాటి తుంపర్లు పడే అవకాశం మాత్రమే ఉంది. శ్రీహరికోట నుండి ఇచ్చాపురం వరకు ఉన్న తీరప్రాంతం అంతా ఈ రోజంతా మేఘావృతమై ఉంటుంది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో జనవరి 11 వ తేదీ నుంచి 13 తేదీల మధ్య వర్షాలు కురుస్తాయని అంచనా ఉన్నందున, వర్షం తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులుుతెలిపారు. తీవ్ర వాయుగుండం ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ - జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది.
గత నాలుగు రోజుల నుంచి...
తెలంగాణలోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంది. గత నాలుగు రోజుల నుంచి చలితీవ్రత పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వానలు పడకపోయినప్పటికీ చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రత మరో రెండు మూడు రోజులు ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. పొగమంచు కూడా అధికంగానే ఉంటుందని, సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో చలిగాలుల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకుంటేనే వ్యాధులు రావని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News