ఏపీలో ఆరు కొత్త మండలాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆరు రూరల్ మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2023-03-02 02:33 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆరు రూరల్ మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రాధమిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రివర్గ సమావేశం తీర్మానం మేరకు కొత్త మండలాల ఏర్పాటుకు గజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. అర్బన్ మండలాలను విభజించడం, రూరల్ మండలాల ఏర్పాటుపై నెలరోజుల్లోగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్త మండాలాలు ఇవే...
కొత్తగా ఏర్పాటవుతున్న మండలలాలను కూడా ఇందులో పేర్కొన్నారు. విజయనగరం, ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, మచిలీపట్నం అర్బన్ మండలాలను రెవెన్యూ పరిపాలన సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా విజయనగరం రూరల్, ఒంగోలు రూరల్, నంద్యాల రూరల్, చిత్తూరు రూరల్, అనంతపురం రూరల్ మండలాలను ఏర్పాటు చేశఆరు. మచిలీపట్నం అర్బన్ మండాలాన్ని మాత్రం ఉత్తరం, దక్షిణ మండలాలుగా విభజించారు.


Tags:    

Similar News