Nara Lokesh : నారా లోకేశ్ ట్వీట్ ఇదే.. చంద్రబాబు కు అవార్డు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు

Update: 2025-12-18 07:04 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ విషయాన్ని రివీల్ చేస్తానని ఉదయం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో తీసుకు వచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలకు గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించిందని చెప్పారు. ఆ ప్రతిష్టాత్మకమైన అవార్డు గురించి తెలియజేశారు.

ట్వీట్ లో ఏమన్నారంటే?
నారా లోకేశ్ ఏం ట్వీట్ చేశారంటే..."మన కుటుంబానికే కాదు… ఆంధ్రప్రదేశ్‌కు కూడా గర్వకారణమైన ఘట్టం ఇది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎకనామిక్ టైమ్స్ ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుతో సత్కరించింది. సంస్కరణల ప్రయాణంలో స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో దేశాన్ని ముందుకు నడిపించిన నాయకులు చాలా కొద్దిమంది మాత్రమే. పాలనలో సంస్కరణలు, వేగం, నమ్మకంపై ఆయన చూపిన అచంచల దృష్టికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది" అని లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.


Tags:    

Similar News