Andhra Pradesh : నేడు తిరుమలకు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తిరుమలకు చేరుకోనున్నారు. కాలినడకన ఆయన తిరుమలకు చేరుకుంటారు
pawan kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తిరుమలకు చేరుకోనున్నారు. కాలినడకన ఆయన తిరుమలకు చేరుకుంటారు. రేపు తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును తిరుపతిలో ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ వివాదంలో ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న సంగతి తెలిసిందే.
పదకొండు రోజుల పాటు...
పవన్ పదకొండు రోజుల పాటు ఈ దీక్షను చేపట్టారు. దీక్ష విరమణను తిరుమలలో చేయాలని నిర్ణయించుకున్నారు. నేడు తిరుమలకు చేరుకుని రేపు కూడా తిరుమలలోనే పవన్ కల్యాణ్ ఉండనున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. అనంతరం ఎల్లుండి తిరుపతిలో వారాహి సభలో పవన్ ప్రసంగించనున్నారు.