నేడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
pawan kalyan delhi tour today
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.30కి ఢిల్లీకి బయల్దేరనున్నారు. బీజేపీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ అక్కడ మహాయుతి కూటమి విజయం సాధించడంతో ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా కలిసేందుకు వెళుతున్నట్లు తెలిసింది.
రాష్ట్ర సమస్యలను...
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజపీ కూటమి విజయానికి అభినందనలు తెలపి అనంతరం రాష్ట్ర సమస్యలను గురించి కూడా పవన్ కల్యాణ్ ప్రస్తావించే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయ పరిణామాలతో పాటు పలు అభివృద్ధి పనులపై కూడా బీజేపీ కేంద్ర నాయకత్వంతో పవన్ కల్యాణ్ చర్చించే అవకాశాలున్నాయి.