Pawan Kalyan : నేడు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ‌్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న్నారు. ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు
pawan kalyan
ఆంధ్రప్రదేశ్ డిప్యూట ీసీఎం పవన్ కల్యాణ‌్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. తిరుమలకు నిన్న రాత్రి కాలినడకన బయలుదేరిన పవన్ కల్యాణ్ అక్కడ రాత్రి బస చేశారు. గత ప్రభుత్వంలో ఆలయాలపై జరిగిన దాడులకు నిరసనతో పాటు లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని భావించిన పవన్ కల్యాణ్ పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.
అన్నదాన సత్రంలో...
ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళతారు. అక్కడ భక్తులకు అందుతున్న అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అన్న ప్రసాదాల నాణ్యతతో పాటు, లడ్డూ క్వాలిటీపై కూడా పవన్ భక్తులను అడిగి తెలుసుకునే అవకాశముంది. తిరుమలలో అన్ని ప్రాంతాలను ఆయన కలియదిరిగి పరిశీలించే అవకాశముంది. వసతి గృహాలు, భక్తుల సౌకర్యాలపై కూడా పవన్ అధికారులను, భక్తులను అడిగి తెలుసుకోనున్నారు.