Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

Update: 2025-02-19 03:15 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. వివిధ సంస్థలకు చెందిన అధికారులతో సమావేశమవుతారు. వివిధ శాఖలతో సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి రానున్నారు.

సాయంత్రం ఢిల్లీకి...
ఉదయం పదకొండున్నర గంటలకు యూఎస్ ప్రతినిధులతో జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ పై అవగాహన ఒప్పందం చేసుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ పై సమీక్ష ను చంద్రబాబు నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News