నేడు చంద్రబాబు సమీక్షలు చేసే శాఖలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉండవల్లి లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రబాబు సచివాలయానికి వస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విద్యుత్తు శాఖపై చంద్రబాబు అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఎలక్ట్రిక్ బస్సులు...
అనంతరం రాష్ట్ర రవాణా రోడ్డు సంస్థకు సంబంధించిన అధికారులతో సమీక్షను చంద్రబాబు నిర్వహిస్తారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఏపీఎస్ ఆర్టీసీలో త్వరలో ఉచిత బస్సు పథకం ప్రవేశపెడుతున్నందున ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కువగా కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది.