ఆదాయాన్ని పెంచుకోవడంపై నేడు చంద్రబాబు రివ్యూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేడ షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

Update: 2025-02-04 03:45 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేడ షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి రానున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు ఆదాయార్జన శాఖలకు సంబంధించి చంద్రబాబు అధికారులు, మంత్రులు సమీక్ష చేయనున్నారు.

ఆదాయాన్ని పెంచుకోవడంపై...
ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రజలపై భారం పడకుండా ఎలా చర్యలు తీసుకోవాలన్న దానిపై అధికారుల నుంచి సూచనలు కోరనున్నారు. అదే సమయంలో ఏ ఏ శాఖలు ఆదాయాన్ని ఆర్జించడంలో వెనకబడి ఉన్నాయన్న దానిపై కూడా ఆరా తీయనున్నారరు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్లానింగ్ డిపార్ట్ మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. రాత్రి ఏడు గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు.


Tags:    

Similar News