చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది

Update: 2025-03-10 04:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరుతారు. 11గంటల వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత ఆర్టీజీఎస్, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షను చంద్రబాబు నాయుడు నిర్వహించచనున్నారు.

రాత్రికి విజయవాడలో...
మధ్యాహ్నం 12గంటల నుంచి 1.25 వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు సచివాలయం నుంచి విజయవాడ మురళీ ఫోర్చూన్ హోటల్‌కు చంద్రబాబు వెళ్లనున్నారు. రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నోరి దత్తాత్రేయ నాయుడు పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబు రాత్రి 08.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News