Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఈరోజు పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఉదయం 10.45 గంటలకు సచివాలయానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11.00 గంటలకు 16వ ఆర్థిక సంఘం సభ్యులతో భేటీ అవుతారు.
వివిధ కార్యక్రమాలతో...
అనంతరం అధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. రాత్రి ఏడు గంటలకు విజయవాడ బెరం పార్కుకు బయలుదేరుతారు. 07.10 గంటలకు ఆర్థిక సంఘం సభ్యులతో విందులో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనంతరం రాత్రి 08.20 గంటలకు ఢిల్లీ బయలుదేరి చంద్రబాబు వెళతారు.