Chandrababu : చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-02-24 02:12 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 9.25 గంటలకు బయలుదేరి అసెంబ్లీకి వెళతారు. సభలో గవర్నర్ ప్రసంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు అసెంబ్లీ హాలు జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం నుంచి సమీక్షలు
మధ్యాహ్నం 12.45 గంటలకు కొల్లేరు సమస్యపై సచివాలయంలో చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు రియల్ టైం గవర్నెన్స్, మూడు గంటలకు బడ్జెట్ పై రివ్యూ చేయనున్నారు. బడ్జెట్ లో ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత మిచ్చారో తెలుసుకుని మార్పులు, చేర్పులు సూచించనున్నారు. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు


Tags:    

Similar News