Chandrababu : చంద్రబాబు నేడు సమీక్షలతో బిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-02-13 03:46 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి చేరుకుంటారు. ఈరో్జు వివిధ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

రెండు శాఖలపై...
ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు అధికారులతో చర్చిస్తారు. అనంతరం 12.10 గంటలకు పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. ఏపీలో టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు, మంత్రిలో చర్చలు జరుపుతారు. అనంతరం జలవనరుల శాఖ పై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.


Tags:    

Similar News