చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ శాఖలపై సమీక్షలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుంటారు. వచ్చిన వెంటనే అధికారులు, కొందరు ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారితో సమావేశమవుతారు.
ఎస్ఐపీబీ సమావేశంలో...
అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సర్క్యులర్ ఎకానమీపై సమీక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.