Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 11.30 గంటలకు వెలగపూడి సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. వివిధ శాఖలపై చంద్రబాబు సమీక్షిస్తారు. అధికారులు, మంత్రులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
వివిధ శాఖలపై సమీక్షలు...
ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ఆర్టీజీఎస్‌పై సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పర్యాటక శాఖపై చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలు, చేసుకోవాల్సిన ఒప్పందాలపై ఆయన అధికారులతో మాట్లాడతారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.