Andhra Pradesh : నేడు పీ4 పథకం ప్రారంభం
ఉగాదికి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పీ4 పథకానికి శ్రీకారం చుట్టనున్నారు
ఉగాదికి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పీ4 పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు, వారికి అన్ని రంగాల్లో చేయూతను అందించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం డిజైన్ చేశారు.
సంపన్నుల చేత...
దేశంలో, విదేశాల్లో ఉన్న భారతీయ మూలాలున్న సంపన్నులు కొన్ని పేద కుటుంబాలను దగ్గరకు తీసుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. వారి మౌలిక సమస్యలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి విడతగా ఇరవై లక్షల పేద కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు.