Chandrababu : ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు

దావోస్‌ సమావేశాలు ముగించుకుని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు

Update: 2025-01-24 02:57 GMT

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశాలు ముగించుకుని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న సాయంత్రం 4.30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయలుదేరి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా వన్‌ జన్‌పథ్‌లోని తన అధికారిక నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు.

కేంద్ర మంత్రులతో...
శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. వారితో దావోస్ లో జరిగిన వివిధ రకాల చర్చల గురించి చర్చించే అవకాశముందని చెబుతున్నారు. అనంతరం బయలుదేరి ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి విజయవాడకు చేరుకుంటారని, ఈ నెల 26న జరిగే రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు.


Tags:    

Similar News