Chandrababu : బాపట్లలో చంద్రబాబు స్థలం కబ్జా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థలాన్ని కబ్జా చేసిన ఘటన వెలుగు చూసింది.

Update: 2025-02-03 02:14 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థలాన్ని కబ్జా చేసిన ఘటన వెలుగు చూసింది. బాపట్లలో ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయం కోసం కేటాయించాిన స్థలాన్ని ఒక వ్యక్తి కబ్జా చేసిన విషయం అధికారుల దృష్టికి రావడంతో వెంటనే చర్యలు ప్రారంభించారు. దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం బాపట్లలో తెలుగుదేశం పార్టీ కార్యాయాన్న నిర్మించడం కోసం ఒక దాత చంద్రబాబు నాయుడు పేరిట 9.5 సెంట్ల స్థలాన్ని రిజిస్టర్ చేయించారు.

కోటిన్నర స్థలాన్ని...
అయితే బాపట్ల గత రెండు దశాబ్దాల కాలంలో బాగా అభివృద్ధి చెందడంతో స్థలం విలువ కూడా పెరిగింది. ఆ స్థలం విలువ దాదాపు కోటిన్నర ఉంటుందని చెబుతున్నారు. అయితే సత్తార్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఈ డాక్యుమెంట్లను పెట్టి బ్యాంకు లోన్ కోసం ప్రయత్నించగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. బాపట్ల ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సత్తార్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.


Tags:    

Similar News