Andhra Pradesh : నేడు చంద్రబాబు పెట్టుబడులపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎస్ఐపీబీ సమావేశం నిర్వహిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎస్ఐపీబీ సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈ సమావేశాన్ని చంద్రబాబు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ సంస్థలతో మరోసారి చర్చలు జరపి త్వరగా పరిశ్రమలను గ్రౌండ్ చేయాలని అధికారులను ఆదేశించనున్నారు.
పెట్టుబడులపై....
రాష్ట్రంలో పెట్టుబడులు ఎంత మేరకు వచ్చాయి? ఎంత మేరకు రావాల్సి ఉంది? అన్న దానిపై ప్రధానంగా చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలతో పాటు ఇస్తున్న వెసులుబాట్లు గురించి కూడా చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు. పెట్టుబడులు అత్యధికంగా తీసుకు రావడమే ఈ సమావేశం లక్ష్యంగా కనిపిస్తుంది.