అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు హెచ్చరిక
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఆడబిడ్డలల జోలికొస్తే తాటతీస్తామని, మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చామని చంద్రబాబు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు స్వేచ్చగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండాపోయిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని అన్న ఆయన గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో డ్రగ్స్ , గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది.
గంజాయి విషయంలో...
గత పాలకులు కనీసం గంజాయి, డ్రగ్స్ పై సమీక్ష చేయలేదన్న చంద్రబాబు అసెంబ్లీలో చర్చించిన పాపాన పోలేదని చంద్రబాబు తెలిపారు. మత్తు పదార్ధాలకు అలవాటు పడిన వారిలో మార్పు అంత తేలిగ్గా రాదని, వ్యవస్థీకృతంగా మారిన గంజాయిసాగు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామని చంద్రబాబు వివరించారు. . సోషల్ మీడియా ముసుగులో రోత పుట్టించే రాతలు రాశారని, మహిళలపై వ్యక్తిగత దూషణలు చేశారని, ఆడబిడ్డలు తలెత్తుకుని తిరగలేని విధంగా పోస్టులు పెట్టారని చంద్రబాబు అన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు.