గవర్నర్ ను కలవనున్న లాయర్ల జేఏసీ
ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను అడ్వకేట్ జేఏసీ కలవనుంది.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను అడ్వకేట్ జేఏసీ కలవనుంది. ఉదయం 11 గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి ఇద్దరు న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడంపై తమ నిరసనను గవర్నర్ కు తెలియజేయనున్నారు.
కొలీజియం నిర్ణయాన్ని....
సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయానని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా ఏపీ హైకోర్టు లాయర్లు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అన్యాయంగా ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేశారంటూ వారు ఆరోపిస్తున్నారు. తమ నిరసనలను తెలియజేస్తూనే ఇటు గవర్నర్ కు కూడా వినతి పత్రాన్ని సమర్పించనున్నారు.