రంపచోడవరంలో పెద్దపులి సంచారం
రంపచోడవరం మండలం తాళ్లపాలెంలో పెద్దపులి సంచారం కలకం రేపుతుంది
రంపచోడవరం మండలం తాళ్లపాలెంలో పెద్దపులి సంచారం కలకం రేపుతుంది. నిన్న రాత్రి పశువులపాకలో దూడపై దాడి చేసి పెద్దపులి చంపేసింది. ఇరవై రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో సంచరించిన ఇదే పెద్దపులిని ఈనెల 6వ తేదీన కూర్మాపురంలో అటవీశాఖ సిబ్బంది బంధించారు. కొన్ని రోజులు విశాఖ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోఅధికారులు ఉంచారు.
పాపికొండల అడవి నుంచి...
పులికి రేడియో కాలర్ అమర్చి పాపికొండల అడవిలో అధికారులు తిరిగి వదిలేశారు. పాపికొండల్లో వదిలేసిన పెద్దపులి రంపచోడవరం ప్రాంతంలోకి వచ్చినట్లు అటవీ శా3ఖ అధికారులు గుర్తించారు. పెద్దపులి సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు గిరిజనులు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు.