ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవత్ర 35 డిగ్రీలు నమోదైనా మార్చి మొదటి వారం నుంచి 40 డిగ్రీలు దాటే అవకాశలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి కరువు వచ్చే అవకాశలు ఉన్నాయని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. పడాల్సిన సమయంలో వానలు పడకపోవడం రైతులకు కష్టాలు అతి దగ్గరలోనే వున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎలినినో ప్రభావం తో వర్షాలు చాలా చాలా తక్కువ గా అంటే సాధారణ కంటే తక్కువ గా నమోదవుతాయని పేర్కొంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఏండల తీవత్ర ఉంటుంది. ముఖ్యం గా వృద్ధులు, పిల్లల జాగ్రత్త లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఏండల తీవత్ర నుంచి తగిన జాగ్రత్త లు తీసుకోవాలి. 50 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు వున్నాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
రేపటి నుంచి మాత్రం...
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ద్రోణి ఆవర్తనం కారణంగా కొంత చల్లటి వాతావరణం నెలకొంది. అయితే మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడిచింది. మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతాయని, ఈసారి భానుడి ప్రతాపం ఒక లెవెల్లో ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, పగటి పూట బయటకు రాకపోవడమే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. అదే సమయంలో చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
పొడి వాతావరణం...
తెలంగాణలో నేడు కూడా వాతావరణం పొడిగా ఉండనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలో నేడు కూడా వానలు పడే అవకాశముందని పేర్కొంది. ఈరోజు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని, ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే మిగిలిన చోట్ల మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఉక్కపోత వాతావరణం నెలకొని ఉంటుందని చెప్పారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీలు నమోదవుతాయని చెప్పింది. ఇక రేపటి నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.