Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ జరుగుతుంది
ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి నెల 1వ తేదీన ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
65 లక్షల మందికి పైగా....
ఈరోజు సిబ్బందితో కలసి ప్రజాప్రతినిధులు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలకు మందికి పైగా పింఛన్లను అందుకుంటున్నారు. ఈరోజు పింఛన్లు అందని వారికి ఈ నెల 2వ తేదీన పంపిణీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. పింఛన్లకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే జమ చేయడంతో నేటి నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.