నేటితో మూవీ టిక్కెట్ల వివాదానికి తెరపడనుందా?

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధర తగ్గింపు విధానానికి నేడు తెర పడే అవకాశముంది. ప్రభుత్వం కమిటీ నేడు సమావేశం కానుంది.

Update: 2021-12-31 02:45 GMT

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధర తగ్గింపు విధానానికి నేడు తెర పడే అవకాశముంది. ప్రభుత్వం నియమించిన కమిటీ నేడు సమావేశం కానుంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ జీవో నెంబరు 35ను తెచ్చింది. దీనిపై నిర్మాతలు, థియేటర్ల యజమానులు అభ్యంతరం తెలుపుతున్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఈ వివాదం నడుస్తుండగానే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచుకునే అధికారం ప్రభుత్వం థియేటర్ యజమానులకు ఇచ్చింది.

కమిటీ సమావేశమై....
ఏపీ ప్రభుత్వం నిర్ణయాలతో ఇప్పటికే కొన్ని థియేటర్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈరోజు ప్రభుత్వం నియమించిన కమిటీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల వినతులను పరిశీలిస్తుంది. న్యాయస్థానం సూచన మేరకు ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. సంక్రాంతి సీజన్ కావడం, పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో ప్రభుత్వం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.


Tags:    

Similar News