Ys Jagan : జగన్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారా?

వైసీపీ నేత జగన్ నిర్ణయం ఎప్పుడు అమలవుతుందా? అని నేతలు ఆసక్తిగా చూస్తున్నారు

Update: 2026-01-20 09:06 GMT

వైసీపీ నేత జగన్ నిర్ణయం ఎప్పుడు అమలవుతుందా? అని నేతలు ఆసక్తిగా చూస్తున్నారు. పొరుగు రాష్ట్రంలోని కేసీఆర్ లెక్క కాకుండా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి జగన్ రాజకీయంగా యాక్టివ్ అయి కొంత నేతల్లోనూ, క్యాడర్ లోనూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అయితే జగన్ ఎంత యాక్టివ్ అయినా దాదాపు ఒకటిన్నరేళ్లు కొంత నేతలు, క్యాడర్ కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. ముఖ్యమైన నేతలు మినహాయిస్తే ఎక్కువ మంది నేతలు అసలు ఏపీ రాజకీయాల్లో కనిపించనూ లేదు. ఇప్పటికీ అనేక మంది నేతల పరిస్థితి అలాగే ఉంది. అయితే మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు యాక్టివ్ కాకతప్పడం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో...
స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు ఎత్తివేయకుండా గెలుపుతో సంబంధం లేకుండా పోరాటం చేస్తేనే శాసనసభ ఎన్నికల వరకూ క్యాడర్ నిలబడుతుంది. ఆ విషయం నేతలకు తెలియనిది కాదు. అందుకే నేతలు ఇప్పుడు దాదాపు 175 నియోజకవర్గాల్లో యాక్టివ్ అయ్యారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో పోటీ చేసే వారిని ఎంపిక చేయడంతో పాటు వారికి అవసరమైన ఆర్థిక సాయాన్ని కొంత వరకైనా నియోజకవర్గ స్థాయి నేతలు చేయాల్సి ఉంటుంది. అందుకోసమే నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల్లో నేతలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నారు. అయితే ఈసారి స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక కూడా కేంద్ర పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నది సమాచారం.
ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి...
ఈ రెండేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఇప్పటికే జగన్ నియోజకవర్గ స్థాయి నేతలకు సూచించినట్లు తెలిసింది. అయితే నియోజకవర్గ ఇన్ ఛార్జులతో పాటు అభ్యర్థుల ఎంపికలో పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులను కూడా నియమించి వారితో స్క్కూటినీ కూడా చేయిస్తారని వినికిడి. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి వారిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని, అలాగే పార్టీ ఓటమి పాలయినా జెండాను వదలిపెట్టకుండా పార్టీ వెంటనే నడిచిన వారికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించారని చెబుతున్నారు. అయితే ఇందుకోసం అభ్యర్థుల ఎంపికలో ఏదైనా లోపం ఉంటే సమాచారాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరవేయడానికి కూడా ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. తద్వారా నిజమైన కార్యకర్తలకు అవకాశమిచ్చినట్లవుతుందని జగన్ ఈ మేరకు సార్టీ కార్యాలయంలోని నేతలను ఆదేశించినట్లు తెలిసింద.ి


Tags:    

Similar News