‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ ప్రారంభించింది. చౌకగా ఆటో , ట్యాక్సీ సేవలు అందించేందుకు ఈ యాప్ ను ప్రభుత్వం తీసుకు వచ్చంది. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే తక్కువ ఖర్చులో ప్రయాణించే వీలుంది. ప్రత్యేకంగా ప్రయివేటు వాహనాల్లో ప్రయాణించే వారి కోసమే ఏపీ ప్రభుత్వం ఈ యాప్ ను తీసుకు వచ్చింది.
తక్కువ ఖర్చుతో...
యాప్ , వాట్సప్, కాల్ ద్వారా ట్యాక్సీ లేదా ఆటోను బుకింగ్ చేసుకునే వీలుంది. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ప్రయాణికులకు భద్రత కూడా ఉంటుందని తెలిపింది. డ్రైవర్ల వెరిఫికేషన్ , మహిళల భద్రత తో పాటు పర్యాటకులకు దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యాప్ ను అమలులోకి తెచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి.