Ys Jagan : చంద్రబాబు మూడు దఫాలు సీఎం అయినా ఒక్క మెడికల్ కళాశాల తెచ్చారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చే ముందు మూడు సార్లు ముఖ్యమంత్రి అని, అయితే ఒక్కదఫా అయినా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారా? అని జగన్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చే ముందు మూడు సార్లు ముఖ్యమంత్రి అని, అయితే ఒక్కదఫా అయినా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. మెడికల్ కళాశాలలను ప్రయివేటు పరం చేయడమంటే అవినీతిని ప్రోత్సహించడమేనని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులు లేకుండా ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీ ఆపేదెవరు? అని జగన్ నిలదీశారు. ప్రభుత్వాసుపత్రులను, మెడికల్ కళాశాలలను నడపటం ప్రభుత్వ బాధ్యత అని వైఎస్ జగన్ అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తే ఒక మెడికల్ హబ్ గా ఆపరేట్ చేస్తూ జిల్లాలో ఉన్న అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. అత్యాధుని వైద్యం పేదలకు ఉచితంగా అందుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రయివేటుకు ఇవ్వడం విజనా?
ప్రయివేటు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే ఎక్కువ ఫీజులను గుంజుతారని, వ్యవస్థను నిర్వీర్యం చేసేలా చంద్రబాబు నిర్ణయం తీసుకుటున్నారని వైఎస్ జగన్ అన్నారు. 1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను తెచ్చే ప్రయత్నం చేశామని చెప్పారు. ప్రయివేటు పరం చేయడం విజనా? అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. అన్ని రకాల సదుపాయాలతో ఈ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని తాము భావిస్తే దానికి చంద్రబాబు గండి కొడుతున్నారని అన్నారు. కరోనా వంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడటానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వ పరంగా మెడికల్ సీట్లు పెరుగుతాయని జగన్ అన్నారు.