అమరావతిపై తప్పుడు ప్రచారమా?

రాజధాని అమరావతి పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి నారాయణ అన్నారు

Update: 2026-04-11 07:50 GMT

రాజధాని అమరావతి పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో పనులు వేగంగా మూడు షిఫ్టులలో జరుగుతున్నాయని, అయితే కొందరు అమరావతిలో పనులు జరగడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

చదరపు అడుగుకు...
అమరావతిలో గతంలో కంటే పనులు వేగంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, అధికారుల భవనాలు మే నాటికి పూర్తిచేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ఖర్చులపై తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని, స్క్వేర్ ఫీట్ ధరలపై వాస్తవాలు వక్రీకరిస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు.


Tags:    

Similar News