Amaravathi : అమరావతి పనుల పురోగతిపై సమీక్ష

అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల పురోగ‌తిపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ నిర్వహించారు

Update: 2026-04-08 05:33 GMT

అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల పురోగ‌తిపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ నిర్వహించారు. స‌మీక్ష‌కు ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్,ఇంజినీర్లు,కాంట్రాక్ట్ సంస్థ‌ల ప్ర‌తినిధులు హాజ‌రయ్యారు. ఈనెల‌లోనే ప‌లు భ‌వ‌నాలు పూర్తి చేసి ప్ర‌భుత్వానికి అప్ప‌గించ‌డంపై మంత్రి నారాయణ చ‌ర్చ‌ించారు.

అనుకున్న సమయానికే...
అమ‌రావ‌తిలో ప్ర‌జాప్ర‌తినిధులు,అధికారులు,ఉద్యోగుల కోసం 4026 ఇళ్లను ప్ర‌భుత్వం నిర్మిస్తుంది. నిర్మాణాలు పూర్తవుతున్న ట‌వ‌ర్ల వ‌ద్ద మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై స‌మావేశంలో చ‌ర్చ‌ జరిగింది. పనులు అనుకున్నసమయానికి, వేగంగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి నారాయణ ఆదేశించారు.


Tags:    

Similar News