Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఈరోజు ఉదయం 10.45 గంటలకు సచివాలయానికి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు.
రహదారులపై సమీక్ష...
ఉదయం పదకొండున్నర గంటలకు ఆర్ & బి, లాజిస్టిక్స్ పై సమీక్ష నిర్వహిస్తారు. రోడ్ల పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. అవసరమైతే రహదారుల మరమ్మతులు చేయాలని ఆదేశించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రెవిన్యూ శాఖపై సమీక్షను చంద్రబాబు నిర్వహిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు