రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు భారీ ఊరట లభించింది

Update: 2026-04-10 02:42 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. పెండింగ్‌లో ఉన్న గ్రాట్యూటీ మరియు సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ. 2950 కోట్ల చెల్లింపులు విడుదలయ్యాయి.

పోలీసుల సరెండర్ లీవులు...
ఈ మొత్తాలు సంబంధిత రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. సర్వీస్‌లో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి. ఉద్యోగులుకు ముఖ్యంగా పెన్షనర్లకు ఇది ఉపశమనమని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.


Tags:    

Similar News