Andhra Pradesh : నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. పార్లమెంట్ లో రాజధాని అమరావతి చట్టం ఆమోదం నేపధ్యంలో ప్రధాని, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు మంత్రివర్గం తెలపనుంది. ఎస్ఐపీబీలో చర్చించిన పెట్టుబడులకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. 31 ప్రాజెక్ట్ లు..39,436 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లకు ఆమోదం తెలపనుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు క్యాబినెట్ ఓకే చెప్పనుంది. - ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ఏర్పాటు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనుంది.
రాజధాని అమరావతి నిర్మాణంపై...
రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. క్యాబినెట్ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రాబు చర్చించనున్నారు. జగన్ మావిగన్ ప్రచారంపై ఎప్పటికప్పుడు మంత్రులు అలెర్ట్ గా ఉండాలని చెప్పే అవకాశం ఉంది. సోషల్ మీడియా దుష్ప్రచారంపై మంత్రులకు సూచనలు చేయనున్నారు. త్వరలో కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి కానుండడంతో జనంలోకి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించనున్నారు.