Chandrababu : టీడీపీ ఆఫీసులో చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 11.05 గంటలకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.ఆయన దాదాపు మూడు గంటలకు పైగానే నేడు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. పార్టీ నేతలతోనూ సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు.
ప్రజల నుంచి వినతులు...
పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. వీలయినన్నిసమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు అవసరమైన ఆదేశాలను అధికారులకు జారీ చేయనున్నారు. అనంతం మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. చంద్రబాబు నేడు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి భారీగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.