మావిగన్ ఫ్లెక్సీ కలకలం

అమరావతికి సమీపంలో తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ కలకలం రేపుతుంది

Update: 2026-04-09 05:57 GMT

అమరావతికి సమీపంలో తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ కలకలం రేపుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంటి ఎదుట మావిగన్ ఫ్లెక్సీని ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. ఇటీవల మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ తక్కువ ఖర్చుతో మావిగన్ పేరిట రాజధానిని ఏర్పాటు చేయాలని జగన్ కూటమి ప్రభుత్వానికి సూచించారు.

అమరావతి వద్దంటూ...
మావిగన్ నినాదం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో తాడేపల్లిలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో అందరూ దానిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. రాజధాని అమరావతికి రెండు లక్షల కోట్లు పెట్టడం వృధా అని జగన్ పదే పదే చెబుతున్నారు. దీంతో మరొకసారి ఫ్లెక్సీలతో రాజధాని అమరావతి వద్దు..మూడు జిల్లాల మావిగన్‌తోనే అభివృద్ధి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది.













Tags:    

Similar News