Amaravathi : దమ్ముంటే అమరావతికి రండి : మంత్రి సవాల్
అమరావతిపై తప్పుడు ప్రచారాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు
అమరావతిపై తప్పుడు ప్రచారాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. నాలుగు రోజుల నుంచి అమరావతిలోనే ఉన్నానని, దమ్ముంటే వరదలు చూపించాలని ఆయన సవాల్ విసిరారు. అనుమానం ఉంటే అమరావతి రావాలని ఛాలెంజ్ చేశారు. రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
వరదలొచ్చాయంటూ...
అనుమానాలు ఉన్న వాళ్లకు సొంత ఖర్చులతో అమరావతి చూపిస్తానన్న మంత్రి, అమరావతి ప్రతిష్ఠతో ఆడుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విష ప్రచారం వల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తుందని అన్నారు. ఇటువంటి దుష్ప్రచారం చేసే వారిపై ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.