Andhra Pradesh : ఏపీలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం
అమరావతిలో నేడు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది
అమరావతిలో నేడు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రెవెన్యూ, ఐటీ శాఖలపై చర్చించనున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖలపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించనున్నారు.
ఎస్పీలతో ప్రత్యేకంగా...
దీంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలపై జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ లతో కూడా సమావేశమై చర్చించనున్నారు. ఈ సమావేశంలో గంజాయి, డ్రగ్స్ ను అరికట్టడంతో పాటు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, మహిళలపై అత్యాచార ఘటనలపై చంద్రబాబు నాయుడు ఎస్పీలతో ప్రత్యేకంగా చర్చించే అవకాశముంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో్ జరుగుతున్న దుష్ప్రచారంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు.